Selfie: వినూత్నంగా వీడియో కోసం ప్రయత్నం.. యువకుడు దుర్మరణం..

రోజురోజుకీ యువతకు సెల్ఫీపై మోజు ఎక్కువవుతోంది. సోషల్‌ మీడియాలో రీల్స్‌ వచ్చాకా ఇది వ్యసనంగా మారుతోంది. అందరి కంటే కొత్తగా వీడియో తీసి దానిని సోషల్‌ మీడియాలో పెట్టి ఎన్ని లైకులు వస్తే అంత సంబరపడిపోతున్నారు.

Updated : 05 May 2022 05:12 IST

వెల్లూర్‌(తమిళనాడు): రోజురోజుకీ యువతకు సెల్ఫీపై మోజు ఎక్కువవుతోంది. సోషల్‌ మీడియాలో రీల్స్‌ వచ్చాకా ఇది వ్యసనంగా మారుతోంది. అందరి కంటే కొత్తగా వీడియో తీసి దానిని సోషల్‌ మీడియాలో పెట్టి ఎన్ని లైకులు వస్తే అంత సంబరపడిపోతున్నారు. కానీ ఈ మాయలో విలువైన ప్రాణాలు కొల్పోతున్నారు. కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా వినూత్నంగా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెడదామనుకున్న ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన వసంతకుమార్‌ (22) గుడియాత్తంలో కేబుల్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రీల్స్‌ తీసి సోషల్‌ మీడియాలో పెట్టడం అతనికి అలవాటు. మంగళవారం తన స్నేహితులతో కలిసి రీల్స్‌ చేయడం కోసం రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. రైలు వస్తుండగా దానితో సెల్ఫీ వీడియో తీసుకుందామని ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తు ఆ ట్రైన్‌ ఢీకొట్టడంతో దాని కింద పడి మరణించాడు.  స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని