Phone tapping case: ఫోన్‌ట్యాపింగ్‌ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్‌

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.

Published : 29 Mar 2024 19:11 IST

హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(సస్పెండెడ్‌) దుగ్యాల ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్‌ స్టేషన్‌లో రాధాకిషన్‌రావును విచారించిన దర్యాప్తు బృందం.. ఈరోజు సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని