Viveka Murder Case: ముగిసిన సునీల్‌ యాదవ్‌ సీబీఐ కస్టడీ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది.

Published : 16 Aug 2021 12:07 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. 10రోజుల పాటు సీబీఐ అధికారులు అతడిని విచారించారు. కస్టడీ ముగియడంతో కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. మధ్యాహ్నం లోపు పులివెందుల కోర్టులో సునీల్‌ యాదవ్‌ను హాజరుపరచనున్నారు.

మరోవైపు ఈ కేసులో సీబీఐ 71వ రోజు విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు విచారణనకు వైఎస్‌ ప్రకాశ్‌రెడ్డి హాజరయ్యారు. మరోవైపు కడపలోనూ సీబీఐ విచారణ కొనసాగుతోంది. అక్కడ ముగ్గురు అనుమానితులను విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని