TS News: పెళ్లైన 14 ఏళ్లకు పుట్టిన పాప డెంగీతో మృతి

ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఇంట అడుగుపెట్టిన గారాలపట్టిని మాయదారి రోగం కబళించడంతో తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. డెంగీతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది నెలల బాలిక మృతి చెందింది. చేవెళ్ల

Published : 03 Oct 2021 06:40 IST

మిన్నంటిన తల్లిదండ్రుల రోదనలు

కేపీహెచ్‌బీకాలనీ, చేవెళ్ల, న్యూస్‌టుడే: ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ ఇంట అడుగుపెట్టిన గారాలపట్టిని మాయదారి రోగం కబళించడంతో తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. డెంగీతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది నెలల బాలిక మృతి చెందింది. చేవెళ్ల రజకనగర్‌కు చెందిన శ్రీనివాస్‌, మంజుల దంపతులకు పెళ్లైన 14 సంవత్సరాలకు పాప సహస్ర జన్మించింది. శ్రీనివాస్‌ ఆటో డ్రైవర్‌. బిడ్డ సహస్రను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. గత నెల 26న పాప అస్వస్థతకు గురవడంతో శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం మియాపూర్‌ పరిధి మదీనగూడలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. డెంగీ పాజిటివ్‌ రావడంతో అక్కడ ఐసీయూ లేదని సదరు ప్రైవేటు ఆసుపత్రికి చెందిన కేపీహెచ్‌బీలోని మరో బ్రాంచిలో గత నెల 28న చేర్పించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అర్ధరాత్రి పాప మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. ఈ సమయంలో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని