Jeevanreddy: ప్రసాద్‌గౌడ్ వచ్చింది ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని చంపేందుకే!
పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు
ఈనాడు, హైదరాబాద్, జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని చంపేందుకే నిందితుడు ప్రసాద్‌గౌడ్ ఇక్కడికి వచ్చాడని బంజారాహిల్స్ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామ మాజీ సర్పంచి లావణ్యగౌడ్‌ను అవమానించారని భావించి జీవన్‌రెడ్డిని హత్య చేయాలని సోమవారం రాత్రి ప్రసాద్ గౌడ్ బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడని తెలుసుకున్నారు. ఇందుకోసం రెండు నెలల నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడని గుర్తించారు. అతడికి ఆయుధాలు సమకూర్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ-2 లావణ్యగౌడ్‌కు శనివారం తాఖీదులిస్తామని పశ్చిమ మండల పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
తూటా ఒకచోట.. పిస్టల్ మరోచోట
పథకంలో భాగంగా ప్రసాద్‌గౌడ్ ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లి పిస్టల్ కొన్నాడు. తొలుత నేపాల్, తర్వాత నాందేడ్ అంటూ చెప్పిన ప్రసాద్.. తర్వాత నిజం చెప్పాడు. ఇందుకోసం రూ.32 వేలు మధ్యవర్తి ద్వారా చెల్లించాడు. సంతు అలియాస్ సంతోష్ ద్వారా దేశీ పిస్టల్ కొనుగోలు చేసినట్లు విచారణలో ప్రసాద్‌గౌడ్ పోలీసులకు చెప్పాడు. తర్వాత కొద్దిరోజులకు తూటాల కోసం బిహార్‌కు వెళ్లగా అక్కడ లభించకపోవడంతో అక్కడి నుంచి దిల్లీకి వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం తూటాల కోసం నాందేడ్‌కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో రూ.1800కు బటన్ చాకు కొన్నాడు. హైదరాబాద్‌లో బేగంబజార్ ప్రాంతంలో చిన్న ఇనుపగుళ్లు పట్టే బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడు. ప్రసాద్‌గౌడ్‌కు ఆయుధాలను సమకూర్చిన మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
నడుముకు పిస్టల్.. జేబులో కత్తి..:
ఈ నెల 2వ తేదీ రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రసాద్‌గౌడ్ దేశీ పిస్టల్, తన రెండు చరవాణులను కారులో పెట్టాడు. బొమ్మ తుపాకీని నడుం వెనుక, కత్తిని జేబులో పెట్టుకొని నేరుగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసంలోకి వెళ్లాడు. అక్కడున్న సిబ్బంది కళ్లుగప్పి మూడో అంతస్తులోకి చేరుకున్నాడు. పైకి ఎలా, ఎందుకొచ్చావని, కిందకు వెళ్లాలని జీవన్‌రెడ్డి చెప్పడంతో కిందకు వెళ్లాడు. అనంతరం కిందకు వెళ్లిన జీవన్‌రెడ్డితో ప్రసాద్‌గౌడ్ గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేపై దాడి చేశాడు. సిబ్బంది అతన్ని పట్టుకొనే ప్రయత్నం చేయగా నడుము భాగంలో తుపాకీ కనిపించడంతో అదుపులోకి తీసుకొన్నారు. తనిఖీ చేయగా జేబులో కత్తి దొరికింది. ప్రసాద్‌గౌడ్ కారులో పోలీసులకు పిస్టల్, రెండు చరవాణులు లభించాయి. బొమ్మ తుపాకీతో కాల్చినా అందులోని ఇనుపగుళ్లు తగిలితే తీవ్ర గాయాలయ్యేవని పోలీసులు చెబుతున్నారు. ఘర్షణలో జీవన్‌రెడ్డికి స్వల్ప గాయాలవ్వడంతో ఆయన మీడియా ముందుకు రావడం లేదని తెలిసింది.
జీవన్‌రెడ్డికి కవిత పరామర్శ
ఈనాడు, హైదరాబాద్: పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Mahesh Babu: ‘ఆ సహృదయం పేరు మహేశ్ బాబు’.. సూపర్ స్టార్‌కు తారల విషెస్
-
Sports News
ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్
-
Politics News
Bihar: తేజస్వీతో కలిసి గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్ తప్పదా?
-
Politics News
మాధవ్‌పై చర్యలు మొదలు పెడితే వైకాపా సగం ఖాళీ: రామ్మోహన్నాయుడు
-
World News
Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
-
India News
8th Pay Commission: 8వ వేతన కమిషన్‌పై.. కేంద్రం క్లారిటీ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
- Raghurama: రాజధాని మార్చే హక్కు లేదని విజయసాయి చెప్పకనే చెప్పారు: రఘురామ
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Crime news: వాటర్ బాటిల్ కోసం వివాదం.. వ్యక్తిని రైళ్లోనుంచి తోసేసిన సిబ్బంది!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే