అసోంలో బయటపడ్డ భారీ డ్రగ్‌ రాకెట్‌

అస్సాం పోలీసులు ఏకంగా రూ.25 కోట్ల హెరాయిన్‌ను..

Published : 29 Sep 2020 01:20 IST

డిస్పుర్‌: మాదకద్రవ్యాల వ్యవహారం ప్రస్తుతం దేశాన్ని ఊపేస్తోంది. ఈనేపథ్యంలోనే అసోంలో ఓ భారీ డ్రగ్‌ రాకెట్‌ బయటపడింది. పోలీసులు ఏకంగా రూ.25 కోట్ల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో కొద్ది రోజులుగా జరుగుతున్న ముమ్మర సోదాల్లో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత వివరాల ప్రకారం.. నాగాలాండ్‌ సరిహద్దుల్లోని కార్బీ ఆంగ్‌లాంగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోదాలు జరిపిన పోలీసులు మరో డ్రగ్‌ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు రూ.25 కోట్లు ఉంటుందని డీజీపీ ట్విటర్‌లో పేర్కొన్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. సోదాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని