logo

ధాన్యం అదనపు కొనుగోళ్లకు ప్రతిపాదన

మండలం చందోలులో నీటి కోసం చేతిపంపు కొడుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. చందోలు పంచాయతీ పరిధిలోని పెద్దహరిజనవాడకు చెందిన మాజీ సైనికుడు చేబ్రోలు

Published : 20 Jan 2022 04:27 IST


రైతుకు టోకెన్‌ అందజేస్తున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ, నరసరావుపేట గ్రామీణ, న్యూస్‌టుడే: ఆర్బీకేల నుంచి పంట కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తెలిపారు. వినుకొండ మండలం నరగాయపాలెం, నరసరావుపేట మండలం ఉప్పలపాడు రైతుభరోసా కేంద్రాలను బుధవారం సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో ధాన్యం సగటు దిగుబడి ఎకరానికి 26 బస్తాలుగా నిర్ణయించి ఈ మేరకు ప్రతిరైతు నుంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 40 బస్తాల వరకు పండిందని ప్రజాప్రతినిధుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు అదనపు ధాన్యం కొనుగోలుకూ పౌరసరఫరాలశాఖకు ప్రతిపాదన పంపామని పేర్కొన్నారు. ఏజెన్సీలు కొనుగోలు చేసిన 21రోజులకు రైతులకు డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయశాఖ సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అందరూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. రైస్‌ మిల్లులు తక్కువ ఉన్నందున వినుకొండ ప్రాంతంలో ధాన్యం కొనుగోలుకు నరసరావుపేట మిల్లర్లను అనుమతించాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన విజ్ఞప్తికి కలెక్టర్‌ అంగీకరించారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం కొనుగోలు టోకెన్లు ఇచ్చారు. ఏపీ రైతు సంఘం నాయకుడు సురేష్‌రాజా ఆర్బీకే సిబ్బంది టోకెన్లు ఇచ్చినా మిల్లర్లు కోత విధిస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్డీవో శేషిరెడ్డి, ఏడీఏ రవికుమార్, యార్డు ఛైర్మన్‌ బాలిరెడ్డి, ఏవో వరలక్ష్మి, తదితరులున్నారు.
బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపండి: డీఎంహెచ్‌వో
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని వివిధ విభాగాలకు రానున్న రెండేళ్లలో అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలు వెంటనే అందజేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్‌ సూచించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో బుధవారం ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యాస్మిన్‌ మాట్లాడుతూ వివిధ పథకాలు సక్రమంగా అమలయ్యేందుకు ఎంత ఖర్చవుతుందో అంచానా వేయాలన్నారు. జీత, భత్యాలతో పాటు భవనాల నిర్మాణం, మరమ్మతులు, శిక్షణ కార్యక్రమాలకు ప్రత్యేకంగా బడ్జెట్ను కోరాలన్నారు. సమావేశంలో ఏడీఎంహెచ్‌వో జయసింహ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని