logo

నాకు తెలియదు.. నాకు తెలియదు

పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు..  నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు.

Published : 27 Apr 2024 04:28 IST

 ప్రధానమంత్రి అఫిడవిట్‌ను తీసుకువచ్చిన వైకాపా అభ్యర్థి
 ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారన్న కూటమి నాయకులు

 పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ భార్య, కుమార్తె ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ఎందుకు పొందుపరచలేదని కూటమి నాయకులు ప్రశ్నిస్తే.. నాకు తెలియదు..  నాకు తెలియదు.. చెప్పడం ఏమిటిని పలువురు తప్పుపడుతున్నారు. పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఆలపాటి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం నామినేషన్ల పత్రాలను పరిశీలించారు. పొన్నూరు వైకాపా అభ్యర్థి మురళీకృష్ణ ఈ నెల 22వ తేదీన మొదటి సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు. అప్పుడు వైకాపా బీఫాం పత్రాలను ఆయన సమర్పించలేదు. మరలా 24వ తేదీన ఆయన మరో రెండు సెట్లు నామినేషన్లు అందజేశారు. వైకాపా అభ్యర్థి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అభ్యంతరం తెలుపుతూ కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ మరో ఫిర్యాదు లేవనెత్తారు. తన భార్య, కుమార్తె ఆస్తుల వివరాలు తనకు తెలియదని మురళీకృష్ణ చెప్పడంపై విమర్శలు వెలువడుతున్నాయి. మురళీకృష్ణ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసి పార్లమెంటు స్థానానికి ప్రధానమంత్రి  మోదీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో భార్య ఆస్తుల వివరాలు పొందుపరచలేదని, ఆ అఫిడవిట్‌ పత్రాలు అధికారులకు అందచేసేందుకు ప్రయత్నించగా రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు