logo

నిధులు నింపుకోవడానికి మేమే దొరికామా!

ఎ.ఎన్‌.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Published : 27 Apr 2024 04:28 IST

 విద్యార్థి సంఘాల ప్రశ్న

ఎ.ఎన్‌.యు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్థికంగా దివాళ తీసే పరిస్థితిలో ఉందని, అందువల్లే మే 1 నుంచి ప్రారంభమయ్యే బీఈడీ పరీక్షలకు అదనంగా డబ్బులు చెల్లించాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మే 1 నుంచి బీఈడీ 4వ సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్ష రాసే విద్యార్థులకు అదనంగా డబ్బులు ఇస్తేనే హాల్‌ టిక్కెట్లు ఇస్తామని పరీక్షల అధికారులు షరుతులు విధించారు. ఏపీ, తెలంగాణ విద్యార్థులకు పర్సంటేజ్‌ సర్టిఫికెట్‌ పేరుతో రూ.350, ఓడీ సర్టిఫికెట్ల కోసం రూ.1000, కన్సోలిడేటెడ్‌ మార్క్‌ లిస్టు కోసం రూ.1,000 ముందుగానే డబ్బులు చెల్లించాలని, అవి ఇస్తేనే హాల్‌ టిక్కెట్లు ఇస్తామని షరతు విధించారు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరో మూడు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏఎన్‌యూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. ఒరిజినల్‌ డిగ్రీ కోసం ఇప్పుడే డబ్బులు చెల్లించాలంటే ఎలా...అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకులకు ఆలస్యంగా వేతనాలు ఇచ్చిన ఘనత ఈ వీసీకే దక్కుతోందన్నారు. ఈ ఉత్తర్వులపై సీఈ రెడ్డి ప్రకాష్‌ను న్యూస్‌టుడే వివరణ కోరగా...ఉన్నతాధికారుల ఆదేశంతోనే ఇచ్చానన్నారు. డిగ్రీలోనూ ఇదే విధానం కొనసాగిస్తున్నామన్నారు. ఈ సెమిస్టర్‌ నుంచే బీఈడీలోనూ ఈ విధానం ప్రవేశపెట్టామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని