logo

కార్మికులకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి

కార్మికులకు తగిన గౌరవం ఇస్తూ వారికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి అయిన సీనియర్ సివిల్ జడ్జి ప్రమీల జైన్ అన్నారు.

Published : 01 May 2024 20:24 IST

ఎదులాపురం: కార్మికులకు తగిన గౌరవం ఇస్తూ వారికి పనికి తగ్గ వేతనం చెల్లించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఇన్‌ఛార్జి కార్యదర్శి అయిన సీనియర్ సివిల్ జడ్జి ప్రమీల జైన్ అన్నారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో బుధవారం న్యాయ సేవా సదన్ భవన్‌లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్మికుల సంక్షేమం కోసం ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు మంజుల సూర్యవార్, దుర్గారాణి, శిక్షణ న్యాయమూర్తులు జీతేన్, మహమ్మద్ అసద్ఉల్లా షరీఫ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని