logo

రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం

ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్‌ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్‌ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు.

Published : 17 May 2024 02:06 IST

నల్ల జెండాలతో భారాస శ్రేణుల నిరసన

అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రహదారిపై నల్ల జెండాలతో నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, భారాస నాయకులు

ఆసిఫాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్‌ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్‌ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. భారాస అధిష్ఠానం పిలుపుమేరకు.. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద రహదారిపై ఆ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అన్నిరకాల ధాన్యానికి బోనస్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సింగిల్‌ విండో ఛైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, నాయకులు మొహ్మద్‌, నిసార్‌, బుర్స పోచయ్య, అశోక్‌, కుమార్‌, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో రాస్తారోకో

కాగజ్‌నగర్‌ గ్రామీణం : రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా.. భారాస శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. కాగజ్‌నగర్‌-ఆసిఫాబాద్‌ క్రాస్‌ రోడ్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆందోళన విరమించారు. పార్టీ నాయకుడు లెండుగురే శ్యాంరావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు ఇస్తామనే వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు, భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేయలేదని ఆరోపించారు. నిరసనలో నాయకులు మోహిన్‌, నక్క శంకర్‌, ఆవుల రాజ్‌కుమార్‌, నక్క శంకర్‌, గౌత్రె గోపాల్‌, బండు పటేల్‌, అంజన్న, రావుజీ, ముక్తేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని