logo

బూడి ఆస్తులు రూ.7.39 కోట్లు, అప్పులు రూ.2.54 కోట్లు

అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి.

Published : 23 Apr 2024 02:36 IST

అనకాపల్లి, అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతోపాటుగా ఇతని భార్య రమణమ్మకు రూ.7.39 కోట్లు ఆస్తులు ఉండగా, అప్పులు రూ. 2.54 కోట్లు ఉన్నాయి. ఈ వివరాలను అఫిడవిట్‌లో ప్రకటించారు. ముత్యాలనాయుడికి చరాస్తులు రూ.1,96,43,683 కాగా స్థిరాస్తులు రూ.1.23 కోట్లు ఉన్నాయి. ఈయన భార్య రమణమ్మకు చరాస్తులు రూ.1,07,48,612, స్థిరాస్తులు రూ.3.13 కోట్లు ఉన్నాయి. బూడి పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ.42.41 లక్షలు, భార్య పేరుతో రూ.13.68 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. బూడికి 300 గ్రాముల బంగారం, భార్య పేరున 1,100 గ్రాముల బంగారం ఉంది.  వీరి వద్ద వెండి లేకపోవడం విశేషం. వివిధ బ్యాంకుల్లో ఇంటి, బంగారం రుణాల కింద బూడి పేరుతో రూ.1.77 కోట్లు, భార్య పేరుతో రూ.77 లక్షలు ఉన్నాయి. ముత్యాలనాయుడుపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు.

అనూరాధ ఆస్తులివీ..

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల వైకాపా అభ్యర్థిని ఈర్లె అనూరాధ చేతిలో రూ.2 లక్షల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ.14.35 లక్షలు, పోస్టల్‌ డిపాజిట్లు రూ.1.94 లక్షలు, నగలు, బంగారం, వజ్రాల విలువ రూ.1.5 కోట్లు, వ్యవసాయ వ్యవసాయేతర భూమి విలువ రూ.3 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కంబాల జోగులపై కేసుల్లేవ్‌

నక్కపల్లి: పేట వైకాపా అభ్యర్థి కంబాల జోగులు చేతిలో నగదు రూ.10 లక్షలు ఉండగా, రూ.40 లక్షల విలువైన కారు, రూ.2 లక్షల విలువైన నాలుగు తులాల బంగారం, బ్యాంకుల్లో డిపాజిట్లు, పాలసీలు ఇతరత్రా రూపేణా రూ.20.63 లక్షలు ఉందని పేర్కొన్నారు. పోలీసు కేసులు లేవని పేర్కొన్నారు.

బండారు సత్యనారాయణమూర్తిపై 4 కేసులు

మాడుగుల, న్యూస్‌టుడే: మాడుగుల అసెంబ్లీ కూటమి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి తన చేతిలో రూ.50 వేల నగదు, బ్యాంకు డిపాజిట్లు రూ7.69 లక్షలు, భూముల విలువ రూ.21.17 కోట్లు, భార్య పేరున రూ.5.81 కోట్ల ఆస్తులు, కారు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2023లో సీఎం జగన్‌ను దూషించినందుకు, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పినగాడి సమీపంలో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులకు అడ్డుకున్నందుకు, 2009లో సబ్బవరం పీఎస్‌ పరిధిలో సీఎం సభ అనంతరం వెళ్తున్న వారిని కులం పేరుతో దూషించినంందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు