logo

తెదేపాలో భారీగా చేరికలు

దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Updated : 04 May 2024 01:37 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: దామనాపల్లి, సంకాడ పంచాయతీల నుంచి వైకాపా, సీపీఎంలకు చెందిన కార్యకర్తలు భారీగా తెదేపాలోకి చేరారు. మాడెం, బంధవీధి, దొడ్డికొండరెల్లివీధి, చిన్నజడుమూరు గ్రామాలనుంచి సుమారు 200 మంది పాడేరు కూటమి అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఆమె కండువాలు కప్పి ఆహ్వానించారు. వైకాపాపై నమ్మకం లేకనే తెదేపాలో చేరుతున్నారని ఆమె పేర్కొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్‌, ప్రధాన కార్యదర్శి మామిడి నాగేంద్ర, దేవరాపల్లి సర్పంచి బుజ్జిబాబు, తెదేపా సీనియర్‌ నాయకుడు చల్లంగి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


ఆదరణ చూడలేకే అడ్డంకులు

గిరిజన గ్రామాల్లో కూటమికి వస్తున్న ఆదరణ చూడలేకే ప్రచారంలో అడ్డంకులు సృష్టిస్తున్నారని గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. దామనాపల్లి పంచాయతీ దొడ్డికొండ, మాడెంకొలనీ, సిగినాపల్లి, సంకాడ పంచాయతీల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సంకాడలో ప్రచారం నిర్వహిస్తుండగా ఎస్సై అప్పలసూరి ఆమె వద్దకు వచ్చి సంతకం చేయాలని కోరడంతో ఇరువురి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈశ్వరి మాట్లాడుతూ.. తాము నిబంధనల ప్రకారమే ప్రచారం చేపడుతున్నామని తెలిపారు. వైకాపా నాయకులు పోలీసుల సహాయంతో ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఇబ్బందులు తొలగాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. ఎంపీగా కొత్తపల్లి గీతను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు, గృహిణులకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్‌ సిలెండర్లతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని