logo

కూటమి కదనోత్సాహం

ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు.

Updated : 25 Apr 2024 04:46 IST

విజయ సంకేతం చూపుతున్న రాజ్‌నాథ్‌ సింగ్‌, వాహనంపై సీఎం రమేశ్‌, కొణతాల, అయ్యన్న, బండారు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. కోయ డాన్సులు, చిడతలు, థింసా నృత్యాలు, బుట్టబొమ్మలు, డప్పుల డాన్సులు ఇలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రదర్శనను తిలకించేందుకు జనం రహదారికి ఇరువైపులా బారులుదీరారు. ప్రదర్శనలో రమేశ్‌ కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనంపై పాల్గొని అందరికీ అభివాదం చేశారు. ఈ ప్రదర్శన స్థానిక సుంకరమెట్ట కూడలి నుంచి రింగ్‌రోడ్డు, చిన్ననాలుగురోడ్లు, పోలీసు స్టేషన్‌, ఎన్టీఆర్‌ కూడలి మీదగా నాలుగురోడ్ల కూడలికి చేరుకుంది. ప్రత్యేక వాహనంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, ఎలమంచిలి, పెందుర్తి కూటమి అభ్యర్థులు కొణతాల రామకృష్ణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్‌కుమార్‌, పంచకర్ల రమేశ్‌బాబు ప్రజలకు అభివాదం చేశారు. తెదేపా, భాజపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు, ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనాయణ పాల్గొన్నారు.

 

రోడ్‌ షోలో కళాకారుల సందడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు