logo

ఆటోలో మంటలు!

గ్యాస్‌ ట్యాంకు వద్ద లీకేజీతో మంటలు చెలరేగి, ఓ సీఎన్‌జీ ఆటో అగ్నికి ఆహుతైన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ డాబా కొట్లు సెంటరులో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

Published : 04 Dec 2022 03:37 IST

పెట్రోల్‌ బంకు ఆవరణలోనే ఘటన 

తప్పిన పెను ప్రమాదం

అజిత్‌సింగ్‌నగర్‌, న్యూస్‌టుడే : గ్యాస్‌ ట్యాంకు వద్ద లీకేజీతో మంటలు చెలరేగి, ఓ సీఎన్‌జీ ఆటో అగ్నికి ఆహుతైన ఘటన అజిత్‌సింగ్‌నగర్‌ డాబా కొట్లు సెంటరులో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... పటమట పంటకాలువ సెంటరు, హైస్కూల్‌ రోడ్డులో నివాసముంటున్న పులప వెంకట రమణ(41) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సీఎన్‌జీ ఆటో గ్యాస్‌ ట్యాంకును శనివారం వాంబేకాలనీ ప్రాంతంలో శుభ్రం చేయించుకున్నాడు. డాబా కొట్లు సెంటరులోని సీఎన్‌జీ గ్యాస్‌ ఫిల్లింగ్‌ బంకు వద్దకు చేరుకుని, గ్యాస్‌ ఫిల్లింగ్‌ చేయించాడు. కొద్ది సెకన్లలోనే లీకేజీ జరిగి మంటలు వ్యాపించాయి. ఆటో.. గ్యాస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌, పెట్రోల్‌ బంకు ఆవరణలోనే ఉండటంతో.. రమణ గుర్తించి బయటకు వచ్చేశాడు. స్థానిలకు సాయంతో ప్రధాన రహదారిపైకి తోసుకువచ్చారు. సీఐ లక్ష్మీనారాయణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌ అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను పూర్తిస్థాయిలో అదుపు చేశారు. అప్పటికే ఆటో పూర్తిగా కాలిపోయింది. పెట్రోల్‌ బంకుకు అత్యంత సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో.. స్థానికులు ఉలిక్కిపడ్డారు. కొందరు వాహనదారులు, పాదచారులు భయంతో పరుగులు తీశారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ పై వంతెనపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని