logo

గణతంత్ర సంబరం

గణతంత్ర దినోత్సవ రాష్ట్ర కార్యక్రమం గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఘనంగా జరిగింది.

Published : 27 Jan 2023 03:54 IST

ప్రగతి పథంలో పయనిస్తాం : కలెక్టర్‌

గణతంత్ర దినోత్సవ రాష్ట్ర కార్యక్రమం గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో ఘనంగా జరిగింది. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పోలీసు కవాతులో వందనం స్వీకరించి ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాల  ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది.

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : విజయవాడలోని పోలీసు పరేడ్‌ గ్రౌండులో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో ప్రజలకు సేవలు అందిస్తూ.. అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధిస్తూ.. జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు సమష్టి కృషి చేద్దామని అధికారులకు పిలుపునిచ్చారు. గృహ నిర్మాణం, ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్లు తదితరాలను అర్హులైన వారికి మంజూరు చేస్తూ.. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించాలని సూచించారు. స్పందన వినతుల స్వీకరణ నేపథ్యంలో ప్రతి అర్జీదారుడు సంతృప్తి చెందేలా సకాలంలో సమస్యలు పరిష్కరించాలన్నారు. రైతులకు అవసరమైన సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వెరసి జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, డీసీపీలు విశాల్‌ గున్నీ, మేరీ ప్రశాంతి, డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉత్తమ సేవలు కనబర్చిన అధికారులు, తదితరులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని