logo

వెలంపల్లికి చేదు అనుభవం

సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు.

Published : 02 May 2024 04:04 IST

పాయకాపురం (మధురానగర్‌), న్యూస్‌టుడే : సెంట్రల్‌ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తి నుంచి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఆయన 23, 62 డివిజన్లలో పర్యటించారు. 62వ డివిజన్‌ సుందరయ్య నగర్‌లో.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హడావుడి సృష్టించాడు. మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలన్నయ్య అంటూ వెలంపల్లి మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చాడు. వెలంపల్లి, పక్కనే ఉన్న నాయకులు, కార్యకర్తలు ఉలికిపాటుకు గురయ్యారు. అతడిని నిలువరించేందుకు ప్రయత్నించినా.. అన్నయ్య అంటూ కౌగిలించుకునేందుకు రాగా.. పోలీసులు అడ్డుపడ్డారు. అతడిని దూరంగా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వెలంపల్లి.. ముందుకు సాగారు. నాసిరకం మద్యంతో మత్తు ఎక్కి ఏం చేస్తున్నావో తెలియడం లేదా అంటూ.. వైకాపా నాయకులే మందుబాబుపై ధుమ ధుమ లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని