logo
Updated : 01/12/2021 06:28 IST

కొత్త పోలీస్‌ కమిషనర్‌కు సవాళ్ల స్వాగతం

ఈనాడు, అమరావతి

కొత్త సీపీ పాలరాజుతో కరచాలనం చేస్తున్న బత్తిన శ్రీనివాసులు

శాంతి, భద్రతల పరంగా విజయవాడ నగరం కీలకమైనది, పైగా చాలా సున్నితమైంది. ఇక్కడ పలు రకాలు నేరాలు జరుగుతుంటాయి. రౌడీషీటర్ల ఆగడాలు, బ్లేడ్‌ బ్యాచ్‌ అరాచకాలు, వైట్‌ కాలర్‌ నేరాలు, దోపిడీలు, కబ్జాలు, తదితరాలు ఎక్కువ నమోదు అవుతుంటాయి.గతంలో ముఠా ఘర్షణలు ఎక్కువగా జరిగేవి. ప్రస్తుతం ఇవి కొంత వరకు తగ్గినా, పూర్తి స్థాయిలో రూపుమాపాలంటే పటిష్ట నిఘా అవసరం. నగర నూతన పోలీస్‌ కమిషనర్‌గా పాలరాజు మంగళవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కొత్త సీపీ గతంలో డీసీపీ హోదాలో ఇక్కడ పని చేశారు. ఆ అనుభవంతో వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సమస్యలివీ..
* విజయవాడ నగరం రైల్వే, రోడ్డు అనుసంధానం బాగా ఉండడంతో గంజాయి స్మగ్లింగ్‌ నగరం గుండా సాగుతోంది.

* కమిషనరేట్‌ పరిధిలో అధికారులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. ఉన్న వారిపై పని ఒత్తిడి బాగా పెరిగింది. దీని వల్ల విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించలేని పరిస్థితి. రాజధాని ఇక్కడికి రావడంతో ప్రొటోకాల్‌, బందోబస్తు, ఎస్కార్ట్‌, తదితర విధులు అధికమయ్యాయి. నేరాల సంఖ్య కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో సిబ్బంది సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. శాంతి, భద్రతల విభాగంలో వెయ్యి మందిపైగా సిబ్బంది అవసరం ఉంది. కీలకమైన టాస్క్‌ఫోర్స్‌, నేరపరిశోధన విభాగంలోనూ కొరత ఎక్కువగా ఉంది.


కన్నేసి ఉంచాల్సిందే..

గరంలో మొత్తం 500కు పైగా రౌడీషీటర్లు, సుమారు 350 మంది వరకు సస్పెక్ట్‌ షీటర్లు ఉన్నారు. వీరితో పాటు బ్లేడ్‌ బ్యాచ్‌, గంజాయి బ్యాచ్‌ను పిలిపించి హెచ్చరిస్తున్నారు.సుమారు 18 మంది రౌడీషీటర్లపై నగర బహిష్కరణ ఉంది.  ఏదైనా జరిగాక హడావుడి కన్నా వీరిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి.


వాహనాల కొరత..

మిషనరేట్‌లో మొత్తం 22 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. నగర పరిధిలో శాంతి, భద్రతల పోలీసుస్టేషన్లు 12 ఉన్నాయి. వీటిల్లో దాదాపు 60 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కీలకపాత్ర పోషించే వీరికి వాహనాలు లేకపోవడం వల్ల కేటాయించిన ప్రాంతాలపై పట్టు సడలుతోంది. స్టేషన్‌కు ఉన్న ఒక్క రక్షక్‌ను ప్రధానంగా రాత్రి పూట గస్తీకి వాడుతున్నారు. అదనంగా కనీసం రెండు జీపులైనా ఇవ్వాలి.


పరిశోధనలో జాప్యం..

నిఘా నిస్తేజంగా మారింది. సీసీ కెమెరాలు సక్రమంగా లేక నేర పరిశోధనలో జాప్యం జరుగుతోంది. అసలు విజయవాడ నగరానికి తగ్గ స్థాయిలో సీసీ కెమెరాలు లేవు. పేరుకు దాదాపు 3వేల కెమెరాలు ఉన్నాయి. కానీ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. కేసుల పరిష్కారంలో, నేరస్థులను గుర్తించడంలో కీలకంగా వ్యవహరించాల్సిన నిఘా నేత్రాలు మసకబారుతున్నాయి. కొత్తవి ఏర్పాటు చేయడంతో పాటు పాతవి బాగు చేయాలి.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని