logo
Published : 03/12/2021 04:58 IST

చిత్ర వార్తలు

బెంజి పైవంతెనకు శబ్ద నియంత్రికలు..!

పై వంతెనపై వెళ్తున్న లారీలు, బస్సులు, వాహనాల శబ్దం కిందకి వినిపించకుండా.. నివాస ప్రాంతాలవారికి ఇబ్బంది కలగకుండా.. విజయవాడలో కొత్తగా కట్టిన బెంజ్‌సర్కిల్‌ రెండోదశ పైవంతెన అంచులకు కొత్తగా వీటిని అమర్చుతున్నారు. దీంతో వంతెనపై వెళ్తున్న వాహనాల శబ్దాలు కిందకి వినిపించడం లేదు. నివాస ప్రాంతాల ప్రజలకు కూడా ధ్వని కాలుష్యం లేకుండా ఉంది.

-ఈనాడు, అమరావతి


బుల్లి బైకుపై బుల్లోడు

బ్యాటరీ బండిపై జాంజాం అని దూసుకుపోతున్న ఈ చిన్నోడి పేరు ఎ.కశ్యప్‌. ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. చైనాకు చెందిన ఈ బ్యాటరీ బండిని రూ.60వేలకు కొనుగోలు చేశారు. 2గంటలు ఛార్జింగ్‌ చేస్తే 60కి.మీ ప్రయాణించొచ్చని తెలిపాడు. విజయవాడ మీసాలరాజారావు వంతెన వద్ద కనిపించిన దృశ్యమిది.

-ఈనాడు, అమరావతి


ఖాతాదారుల సౌకర్యార్థం...!

నిత్యం రద్దీగా ఉండే మహాత్మా గాంధీ రోడ్డులోని కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముందు మొబైల్‌ ఏటీఎం ఏర్పాటు చేశారు. బ్యాంకు లోపల ఉన్న యంత్రం పనిచేయక పోవడంతో వినియోగదారుల ఇబ్బంది పడకుండా ఇలా బయట అందుబాటులో ఉంచారు. పలువురు నగదు డ్రా చేసుకున్నారు.

- ఈనాడు, అమరావతి


దీప వైభవం

కార్తికమాస మాస శివరాత్రి సందర్భంగా గుంటూరు సంపత్‌నగర్‌ శారదా పరమేశ్వరి దేవస్థానంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలను శివలింగాకారంలో వెలిగించి పూజలు నిర్వహించారు.

-న్యూస్‌టుడే, గుంటూరు సాంస్కృతికం


కదలని వాహనం

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు జఠిలమవుతోంది. ముఖ్యంగా జిన్నాటవర్‌ సెంటర్‌ నుంచి పాతబస్టాండు కూడలి వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఆసుపత్రులు, మార్కెట్లకు వచ్చే వారు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే వారితో ఈ ప్రాంతమంతా నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నాజ్‌సెంటర్‌ వైపు నుంచి వచ్చే వాహనాల్ని భగత్‌సింగ్‌ బొమ్మ సెంటర్‌ వైపు నుంచి బస్టాండు దిశగా మళ్లిస్తే సమస్య తీవ్రతను కొంత తగ్గించవచ్చని నగరవాసులు సూచిస్తున్నారు.

-న్యూస్‌టుడే, పట్నంబజారు


బులుగు దీపం.. పురుగు దూరం

మిరప పైరులో వేలాడదీసిన బులుగు రంగు విద్యుద్దీపం

మిరప పైరుపై దాడి చేస్తున్న తామర పురుగుల నివారణకు గారపాడు రైతు తియ్యకూర పేరిరెడ్డి చేపట్టిన వినూత్న ప్రయోగం ఫలితం ఇస్తోంది. ఆయన వారం రోజులుగా రాత్రివేళ పొలంలో బులుగు రంగు పేపర్‌ చుట్టిన విద్యుద్దీపం ఏర్పాటు చేశారు. దాని కింద విషం కలిపిన నీటి పాత్ర ఉంచారు. సాయంత్రం 6 గుంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బులుగు దీపం వెలుగుతుంది. ఆకర్షణకు లోనైన తామర పురుగులు, తెల్లదోమ, నల్లి వచ్చి ఆ నీటి పాత్రలో పడుతున్నాయి. ప్రతి రోజూ ఉదయం చనిపోయిన పురుగులను తొలగిస్తున్నారు. దీనిపై ఉద్యాన శాఖ అధికారి హారిక మాట్లాడుతూ బులుగు రంగు తామర పురుగులను ఆకర్షిస్తుందన్నారు. పొలాల్లో పసుపు, బులుగు రంగుల అట్టలు ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని, ఒక రైతు కాకుండా ఎక్కువ మంది ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.

నీటి పాత్రలో పడిపోయిన పురుగులు

-న్యూస్‌టుడే, గారపాడు (వట్టిచెరుకూరు)

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని