logo

సీఎం జగన్‌కు కనువిప్పు కలగాలి

ఉపాధ్యాయులు చేసిన ఆందోళనలతోనైనా సీఎం జగన్‌కు కనువిప్పు కావాలి. పీఆర్‌సీ జీవోలను ఉపసంహరించుకుని నూతన జీవోలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షల మంది ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు

Published : 21 Jan 2022 04:19 IST

కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు చేసిన ఆందోళనలతోనైనా సీఎం జగన్‌కు కనువిప్పు కావాలి. పీఆర్‌సీ జీవోలను ఉపసంహరించుకుని నూతన జీవోలు ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా 1.70 లక్షల మంది ఉపాధ్యాయులు ఆందోళనలో పాల్గొన్నారు. పీఆర్‌సీతో ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరి చేయాలి. ఉద్యోగుల ఆందోళనకు ఏడుగురు ఎమ్మెల్సీలు మద్దతు తెలుపుతున్నాం.

-కె.ఎస్‌.లక్ష్మణరావు, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ


 

కోత పెడితే జీవనం ఎలా?

రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగులు 3.80 లక్షల మందికి పీఆర్‌సీలో కోత విధించటం అన్యాయం. 70 ఏళ్ల వయసు వారికి పది, 75 సంవత్సరాలకు 15 శాతం అదనపు పెన్షన్‌ని పొందుతున్న పెన్షనర్లకు కోత విధించటంతో ఎలా జీవనం కొనసాగించాలి. ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు వైద్యం ఖర్చులకు డబ్బులు ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఏపీ జేఏసీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు మా సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.

-జి.ప్రభుదాస్‌, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పెన్షనర్ల సంఘం


ఈ విధానాలు విడనాడాలి

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. పీఆర్‌సీలో తీవ్రమైన అన్యాయం చేసింది. ఉద్యోగులకు న్యాయం చేసే వరకు తెదేపా పోరాడుతుంది. ఉపాధ్యాయుల ఆందోళనతోనైనా ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగులకు న్యాయం చేయాలి.

- ఏఎస్‌.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని