logo

పదో తరగతి ఫలితాల్లో విద్యార్థుల సత్తా

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు.

Published : 23 Apr 2024 04:38 IST

కళ్యాణదుర్గం బృందం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. కళ్యాణదుర్గం మండలంలో 69.12శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 27మంది విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు. కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి షేక్షావలి 580మార్కులు సాధించాడు. కళ్యాణదుర్గంకు చెందిన సాయిచేతన్‌ (583), మహ్మద్‌యాసీన్‌ (590), ప్రణవి (591) మార్కులు సాధించారు. శెట్టూరు మండలంలో 75శాతం, బ్రహ్మసముద్రం 86 శాతం, కుందుర్పి 80శాతం, కంబదూరు మండలంలో 74శాతం ఫలితాలు నమోదయ్యాయి.

రాయదుర్గం బృందం: నియోజకవర్గంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 74.26శాతం మేర విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్‌ పాఠశాలలో వందశాతం ఫలితాలు వచ్చాయి. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించటంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. పట్టణంలోని మున్సిపల్‌ మోడల్‌ పాఠశాలలో అతి తక్కువగా 39శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఉపాధ్యాయులు లేకపోవటంతో ఈపరిస్థితి తలెత్తింది.

ఉరవకొండ బృందం: ఉరవకొండ మండలంలో 69.3శాతం ఫలితాలు నమోదు అయ్యాయి. ఎస్సీ బాలికల గురుకులం, పెన్నహోబిలం గురుకులం పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. విడపనకల్లు మండలంలో 64శాతం, కూడేరు 70శాతం, బెళుగుప్ప 70శాతం, వజ్రకరూరు మండలంలో 56శాతం ఫలితాలు నమోదు అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని