logo

వైకాపా ఓటమి తథ్యం : పరిటాల సునీత

రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు.

Published : 07 May 2024 05:06 IST

దివ్యాంగులకు పింఛన్‌పై వివరిస్తూ ఓటుని అభ్యర్థిస్తున్న పరిటాల సునీత

అనంతపురం(కళ్యాణదుర్గంరోడ్డు), ఆత్మకూరు, న్యూస్‌టుడే : రాప్తాడులో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ఓటమి కోసం వైకాపా నాయకులంతా ఎదురుచూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో నాయకులు వైకాపాను వీడి, తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు. సోమవారం అనంతపురం క్యాంపు కార్యాలయం, వెంకటాపురం క్యాంపు కార్యాలయంలో పలు మండలాల వైకాపా నాయకులు తెదేపాలోకి చేరారు. వారందరికీ మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌, పరిటాల సిద్ధార్థ  కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.   బీ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సొంత మండలానికి ఏమీ చేయలేని అసమర్థుడని సునీత, ఎంపీ అభ్యర్థి బి.కె పార్థసారథి మండిపడ్డారు. మండలంలోని బి.యాలేరు, మదిగుబ్బ, రంగంపేట, వేపచెర్ల, వేపచెర్ల దిగువతండా, సనప పంచాయతీల్లో సోమవారం తెదేపా నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బి.యాలేరులో దళితులకు 2017లో పట్టాలు పంపిణీ చేస్తే వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని రద్దు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరికి 2 సెంట్ల స్థలం అందించి, రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని