icon icon icon
icon icon icon

Andhra News: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్‌ కేంద్రాలు

రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా తెలిపారు.

Published : 02 May 2024 16:30 IST

అమరావతి: రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌మీనా తెలిపారు. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్టు చెప్పారు. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం కల్పిస్తాం. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో 224 ఆక్సిలరీ పోలింగ్‌ కేంద్రాల కోసం ఈసీకి ప్రతిపాదనలు పంపాం.

సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు 16,345  ఫిర్యాదులు అందాయి. డబ్బు, మద్యం పంపిణీపై 200 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 10,403 ఫిర్యాదులు కచ్చితమైనవి కావడంతో పరిష్కరించాం. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా, 156 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 150 అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశాం. ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.203 కోట్ల సొత్తు సీజ్‌ చేశాం’’ అని సీఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img