logo
Published : 01/12/2021 02:21 IST

ఆదర్శం ఆ 5 కార్యాలయాలు

ఈనాడు, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు, జంతు సంరక్షణ కేంద్రాలు పునరుత్పాదక శక్తి వినియోగంలో సత్తా చాటాయి. ఎల్బీనగర్‌, ఉప్పల్‌, అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయాలు, మొఘల్‌పుర క్రీడా ప్రాంగణం, లింగంపల్లి నూతన మున్సిపల్‌ కార్యాలయ భవనాలు సౌరశక్తితో స్వయం సమృద్ధి సాధించాయి. వాటిపై ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తుతోనే అవసరాలు తీరుతున్నాయి. అక్కడ విద్యుత్తు బిల్లు దాదాపు సున్నా. త్వరలోనే మరిన్ని భవనాలు ఆ ఘనతను సాధిస్తాయని జీహెచ్‌ఎంసీ ధీమా వ్యక్తం చేస్తోంది.  బల్దియా పరిధిలో 34 కేంద్రాల్లో ఏడాది కిందట సౌర ఫలకలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తుతో జీహెచ్‌ఎంసీ ఖజానాపై రూ.1.4కోట్లు భారం తగ్గుతోందని, అంతకు మించి నగరంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని