logo

అధికారుల పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవు

మున్సిపల్‌ పరిధిలో 8 నెలలుగా పనులు చేయకున్నా సహనం వహించి చూస్తున్నాని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పశువుల ఆసుపత్రి సమావేశ మందిరంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడి అధ్యక్షతన జరిగిన సమీక్ష

Published : 26 May 2022 03:13 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌: మున్సిపల్‌ పరిధిలో 8 నెలలుగా పనులు చేయకున్నా సహనం వహించి చూస్తున్నాని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పశువుల ఆసుపత్రి సమావేశ మందిరంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ జగదీశ్వర్‌రెడి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఈ, ఏఈ, కమిషనర్‌ ఇలా.. ఏ ఒక్క అధికారీ పనులు సక్రమంగా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనుల తీరును మెరుగు పరచుకోకపోతే సహించేది     లేదని హెచ్చరించారు. కొడంగల్‌ పురపాలికలో నేటికీ డంపింగ్‌ యార్డులేక పోవడం బాధాకరమని అన్నారు. తాండూర్‌, వికారాబాద్‌ వెళ్లి డంపింగ్‌ యార్డులను చూసి వచ్చి ఎలా చేయాలో నేర్చుకోవాలని హితవు పలికారు.

జూన్‌ 6న మంత్రి పర్యటన..
మున్సిపల్‌ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సివిల్‌ ఆసుపత్రి, కూరగాయల మార్కెట్‌ ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మంత్రి హరీశ్‌ రావు పాల్గొంటారని తెలిపారు. ఆయా ప్రదేశాల్లో ఏవైనా పనులు పెండింగ్‌లో ఉంటే పూర్తి చేసుకోవాలని సూచించారు. కొత్తగా మున్సిపల్‌ భవనానికి భూమి పూజ, పార్కు, 2 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌యార్డు నిర్మాణం చేసేందుకు భూమి పూజలు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీˆపీˆ ముద్దప్ప, కౌన్సిలర్లు, వివిధశాఖ డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని