logo

మజ్లిస్‌ ఓటమికి మతతత్వ శక్తుల కుట్ర: ఒవైసీ

26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్‌ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు.

Published : 27 Apr 2024 03:06 IST

గోషామహల్‌, న్యూస్‌టుడే: 26 ఏళ్లు శ్రమిస్తే దక్కిన ఎంపీ సీటును 1984 నుంచి కాపాడుకుంటూ వస్తున్నామని మజ్లిస్‌ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. గోషామహల్‌ నియోజకవర్గం జిర్రా నటరాజ్‌నగర్‌లో శుక్రవారం రాత్రి ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మజ్లిస్‌ను ఓడించేందుకు మతతత్వ శక్తులు ఏకమై కుట్రలు చేస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ 17 కోట్ల మంది ముస్లింలను చొరబాటుదారులంటూ అవమానపరిచారన్నారు. ముస్లింలు ఎక్కువ మంది సంతానాన్ని కంటున్నారని ప్రధాని దుష్ప్రచారానికి తెరలేపారన్నారు. వాస్తవానికి మోదీకి ఆరుగురు సోదరులు, అమిత్‌షాకు ఆరుగురు సోదరీమణులు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖ్‌కు 12 మంది సోదర, సోదరీమణులు ఉన్నారన్నారు. 2070 నాటికి దేశంలో ముస్లింల జనాభా హిందువుల కంటే ఎక్కువవుతుందని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సభలో ఎమ్మెల్సీ మీర్జా రహమత్‌ బేగ్‌, కార్పొరేటర్‌ జాకీర్‌ బాక్రీ, మాజీ కార్పొరేటర్‌ సమ్మద్‌ వార్సీ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని