logo

ఎన్వోసీ ఇవ్వడానికి రూ.5 లక్షల లంచం

వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్‌కుమార్‌ అనిశాకు దొరికిపోయాడు.

Updated : 27 Apr 2024 06:30 IST

ఏసీబీకి దొరికిన నీటిపారుదల శాఖ డీఈఈ 

పవన్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: వాణిజ్య భవనానికి నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు రూ.5 లక్షల లంచం డిమాండ్‌ చేసిన నీటిపారుదల శాఖ డిప్యూటీ కార్యనిర్వాహక ఇంజినీరు(డీఈఈ) యాత పవన్‌కుమార్‌ అనిశాకు దొరికిపోయాడు. తన కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని రిమాండుకు తరలించినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామంతాపూర్‌కు చెందిన బిల్డర్‌ గోపగాని రమణమూర్తి ఉప్పల్‌ భగాయత్‌లోని శాంతినగర్‌లో వాణిజ్య భవనం నిర్మాణానికి ఎన్వోసీ కోసందరఖాస్తు చేసుకోగా.. పవన్‌కుమార్‌  రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బాధితుడు అనిశాకు సమాచారం ఇచ్చాడు. రమణమూర్తి శుక్రవారం బుద్ధభవన్‌లోని కార్యాలయంలో పవన్‌కు రూ.4 లక్షలు ఇస్తుండగా పట్టుకున్నారు. నగదు స్వాధీనం చేసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం రిమాండుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని