logo

ఆమోదం 178.. తిరస్కరణ 124

రాజధాని పరిధిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది.

Published : 27 Apr 2024 03:23 IST

నామినేషన్ల పరిశీలన పూర్తి 

వివరాలు వెల్లడిస్తున్న హైదరాబాద్‌ ఆర్వో అనుదీప్‌ దురిశెట్టి. డీఆర్‌వో వెంకటాచారి, పరిశీలకురాలు శ్రీవిద్య

ఈనాడు, హైదరాబాద్‌: రాజధాని పరిధిలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామపత్రాల పరిశీలన శుక్రవారం ముగిసింది. నామపత్రాలను నలుగురు రిటర్నింగ్‌ అధికారులు.. అనుదీప్‌ దురిశెట్టి, హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, కె.శశాంక, గౌతమ్‌ క్షుణ్నంగా పరిశీలించారు. వివరాల్లో లోపాలుండటం.. సరిగా సమర్పించకపోవడం.. తదితర కారణాలతో కొన్ని తిరస్కరణకు గురయ్యాయి. తిరస్కరణకు గురైన అభ్యర్థుల సెక్యూరిటీ డిపాజిట్‌ తిరిగి చెల్లిస్తామని కలెక్టర్‌ తెలిపారు. నామినేషన్‌ ఎందుకు తిరస్కరణకు గురైందో ఆ వివరాలను కూడా అభ్యర్థులకు అందిస్తామన్నారు.

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు..

కార్ఖానా, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు సంబంధించి మొత్తంగా 24 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి మధుకర్‌ నాయక్‌ తెలిపారు. వీరిలో ఎంఏ శ్రీనివాస్‌, బంగారి రాజు, నాగినేని సరితల నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారం పూర్తవడంతో శుక్రవారం వాటి పరిశీలన చేశారు. మొత్తం నామినేషన్లలో మూడు తిరస్కరణకు గురికాగా మిగతా 21 మంది నామినేషన్ల పరిశీలన పూర్తయిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని