logo

తొర్రూరు ప్లాట్ల వేలంలో కాసుల పంట

హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరులోని హెచ్‌ఎండీఏ

Published : 02 Jul 2022 01:33 IST

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్లాట్ల అమ్మకం ద్వారా ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరులోని హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో ప్లాట్ల ఆన్‌లైన్‌ వేలం ద్వారా రెండు రోజుల్లో ప్రభుత్వానికి రూ.159.988 కోట్ల ఆదాయం సమకూరింది. తొలిరోజు ఆన్‌లైన్‌లో 41 ప్లాట్లు విక్రయించారు. రెండో రోజు శుక్రవారం కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. మరో 81 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలంలో విక్రయంచడం ద్వారా రూ.33.58 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా చదరపు గజానికి రూ.35,500 ధర పలకగా.. అత్యల్పంగా చదరపు గజానికి రూ.21 వేలకు వేలంలో కొనుగోలు చేశారు. మిగతా 106 ప్లాట్లను శని, సోమవారం ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్లు హెచ్‌ఎండీఏ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని