logo

పర్యాటకంతో మానసిక ఉల్లాసం

కరోనా మహమ్మారి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. దీని బారినపడి కోలుకున్న వారిలో.. నేటికీ చాలామంది ప్రస్తుతం వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడికితోడు వైరాగ్యంలో బతుకుతున్నట్టుగా బాధపడుతున్నారని నగరంలోని పలువురు మానసిక వైద్యులు చెబుతున్నారు.

Published : 05 Oct 2022 03:23 IST

కొవిడ్‌ బాధితులకు సాంత్వన: మానసిక వైద్యులు

ఈనాడు-హైదరాబాద్‌: కరోనా మహమ్మారి జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. దీని బారినపడి కోలుకున్న వారిలో.. నేటికీ చాలామంది ప్రస్తుతం వివిధ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. మానసిక ఒత్తిడికితోడు వైరాగ్యంలో బతుకుతున్నట్టుగా బాధపడుతున్నారని నగరంలోని పలువురు మానసిక వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటక ప్రాంతాల సందర్శనతో మేలు చేకూరుతుందని వారు సూచిస్తున్నారు. అందుకే ఇంటికి, కార్యాలయాలకే పరిమితమవ్వకుండా.. వారాంతాల్లో కొత్త ప్రదేశాలకు వెళ్తే మనసుకు ఉల్లాసం, సాంత్వన లభిస్తుందని చెబుతున్నారు.  సంబంధిత వ్యక్తులు ఎత్తైన కొండలు, నయనమనోహరమైన ప్రదేశాలకు వెళ్లడం ఉత్తమమని మానసిక వైద్యులంటున్నారు. వాషింగ్టన్‌లో ఉన్న ఎడిత్‌ కోవాన్‌ వర్సిటీ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. నిజమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే యాత్రలుగా వాటిని భావించాలని సూచించింది. తద్వారా మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని తమ పరిశోధనల్లో వెల్లడైనట్లు పేర్కొంది. మ్యూజిక్‌ థెరపీ, వ్యాయామం, అభిజ్ఞా ప్రేరణ, మధుర జ్ఞాపకం, ఇంద్రియ ప్రేరణ ఇవన్నీ చిత్తవైకల్యం చికిత్సలకు సిఫారసు చేయవచ్చని అంటున్నారు.

పలు అనుభూతులు సొంతం: డా. కృష్ణ సాహితి, మానసిక వైద్య నిపుణురాలు

రోజువారీ జీవితంలో తీరికలేకుండా గడిపే ప్రతిఒక్కరికీ.. ఒక్క రోజు సెలవు దొరికితేనే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అలాంటిది మానసిక ఉల్లాసానికి దోహదం చేసేవారితో కలిసి భోజనాలు, మాటామంతి.. ఇలాంటి అనుభూతులు పర్యటనల ద్వారా సమకూరుతాయి. తాజా గాలితోపాటు సూర్యరశ్మి కూడా శరీరానికి అందుతుంది. సంపూర్ణ పర్యాటక అనుభవాన్ని సూచించడానికి కలిసి వచ్చే ప్రతిదీ.. చిత్తవైకల్యం ఉన్న రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.  కరోనా తర్వాత ప్రజారోగ్యంలో పర్యాటక స్థానాన్ని గుర్తించడానికి ఇదే మంచి సమయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని