logo

తెలంగాణ విద్యార్థి ఐకాస ఛైర్మన్‌గా శ్రీహరినాయక్‌

తెలంగాణ విద్యార్థి జేఏసీ (టీఎస్‌జేఏసీ)కి కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం ప్రకటించుకున్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: తెలంగాణ విద్యార్థి జేఏసీ (టీఎస్‌జేఏసీ)కి కొత్త కార్యవర్గాన్ని నియమించినట్లు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం ప్రకటించుకున్నారు. టీఎస్‌జేఏసీ ఛైర్మన్‌గా భట్టు శ్రీహరి, అధ్యక్షుడిగా తూము నవీన్‌యాదవ్‌, వైస్‌ఛైర్మన్లుగా హరీష్‌గౌడ్‌, రంజిత్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా భీమ్‌రావునాయక్‌, ఓయూ జేఏసీ అధ్యక్షుడిగా శివరాత్రిప్రశాంత్‌, కార్యనిర్వహక అధ్యక్షులుగా శ్రీనివాస్‌గౌడ్‌, రాజేష్‌, కేయూ జేఏసీ అధ్యక్షులుగా ఇట్టబోయిన తిరుపతియాదవ్‌ నియమితులయ్యారు.   టీజీవీపీ, బీసీ విద్యార్థి సంఘం, ఎంఎస్‌ఎఫ్‌, ఏఎస్‌ఏ,  బీఎస్‌ఎఫ్‌, సేవాలాల్‌సేన విద్యార్థి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని