logo

రాజకీయాలు పవిత్రంగా ఉంటే సమాజానికి మేలు

దేశంలో రాజకీయాలు ఎంత పవిత్రంగా ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

Published : 20 Mar 2023 02:27 IST

ద్వారకా తిరుమలరావుకు పురస్కారాన్ని అందజేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రమణాచారి తదితరులు

రవీంద్రభారతి: దేశంలో రాజకీయాలు ఎంత పవిత్రంగా ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి  కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌, కిన్నెర కల్చరల్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కిన్నెర- శోభకృత్‌ నామ ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం రవీంద్రభారతిలో నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.హనుమంతరావును సత్కరించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ రామలింగేశ్వరరావు సహా పలువురికి పురస్కారాలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని