logo

పగలు భగభగలు.. రాత్రిపూట సెగలు

మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.

Updated : 03 May 2024 07:25 IST

గురువారం రికార్డు స్థాయిలో 43.6 డిగ్రీలు..
ఈ సీజన్‌లో ఇదే అత్యధికం

ఈనాడు, హైదరాబాద్‌: మే నెల రాకతో ఎండలు మరింత ముదిరాయి. పగటిపూట భానుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఉదయం నుంచే సూరీడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రంగానే ఉంటోంది. ఏడు గంటల వరకు వేడిగాలులు వీస్తున్నాయి. గురువారం నగరంలో పగటిపూట అత్యధిక ఉష్ణోగ్రత 43.6 డిగ్రీలు నమోదైంది. ఈసీజన్‌లో ఇదే అత్యధికం. గత పదేళ్లలో 2015లో 44.3 డిగ్రీలు ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. ఈ వేసవి దీన్ని అధిగమించేలా ఉంది. రాత్రి పూట వేడి ఏమాత్రం తగ్గడం లేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉడికిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని