logo
Published : 27/11/2021 03:28 IST

రైతులు, ప్రజాసంఘాల ర్యాలీ

జమ్మికుంటలో ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు, ప్రజా సంఘాల నాయకులు

జమ్మికుంట, న్యూస్‌టుడే : సాగు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దిల్లీ రైతాంగం ఆందోళన చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా జమ్మికుంటలో శుక్రవారం రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీచౌక్‌ వద్ద నుంచి ఆర్వోబీ రహదారి దాకా ర్యాలీ నిర్వహించి, రాస్తారోకో చేశారు. అమరులైన రైతాంగానికి కేంద్రప్రభుత్వం సాయం చేయాలని నినాదాలు చేశారు. రాస్తారోకోతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా తొలగించారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  మిల్కూరి వాసుదేవరెడ్డి  నాయకులు శీలం అశోక్‌, కాగిత లింగారెడ్డి, సీఐటీయూ నాయకులు కొప్పుల శంకర్‌, జి.రాజకుమారి, సదానందం,  పాల్గొన్నారు.

చొప్పదండిలో...

చొప్పదండి : రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని సీపీఎం నియోజకవర్గ బాధ్యుడు బండారి శేఖర్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో కార్మికులు, రైతులతో కలిసి వ్యవసాయ మార్కెట్‌ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. విద్యుత్తు బిల్లును ఉపసంహరించుకోవాలని, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు.నాయకులు లింగయ్య, అంజయ్య, రమేశ్‌, కనుకమ్మ పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని