logo
Published : 03/12/2021 02:38 IST

ఇన్‌స్పైర్‌ మానక్‌ విజేతలు వీరే

విద్యార్థి అనీల రూపొందించిన సాండ్‌ తెఫ్ట్‌ డిటెక్టర్‌

ఐసిరిసిల్ల (విద్యానగర్‌), న్యూస్‌టుడే: ఇన్‌స్పైర్‌ మానక్‌ 2020-21 రాష్ట్రస్థాయికి జిల్లా నుంచి 9 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఆన్‌లైన్‌లో జరిగిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ మానక్‌ పోటీలలో జిల్లా నుంచి మొత్తం 88 మంది ప్రదర్శనలు రాగా 9 ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. కోనరావుపేట కేజీబీవీ విద్యార్థి జె.అక్షయ్‌ రూపొందించిన విత్తనాలు జల్లే పరికరం, ఇల్లంతకుంట కేజీబీవీ విద్యార్థిని ఎం.అస్మిత రూపొందించిన ఓపెన్‌ మాన్యువల్‌ నియంత్రణ పరికరం, సిరిసిల్ల అర్బన్‌ కేజీబీవీ విద్యార్థిని శ్రీవాణి రూపొందించిన లేజర్‌ లైట్‌ సెక్యూరిటీ అలారం, ధర్మారం జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని పి.కావ్య రూపొందించిన మల్టీపర్పస్‌ గొడుగు, మండేపల్లి టీఎస్‌ఎంఎస్‌ విద్యార్థి ఎం.రేవంత్‌ రూపొందించిన ఆటోమెటిక్‌ ట్రచ్‌ ఫీ శానిటైజర్‌, సిరిసిల్ల గీతానగర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థిని ఎన్‌.నవ్యశ్రీ రూపొందించిన వాటర్‌ బకెట్స్‌, క్యారియర్‌, సిరిసిల్ల కుసుమ రామయ్య జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి జి.అనీల రూపొందించిన సాండ్‌ తెఫ్ట్‌ డిటెక్టర్‌, మండేపల్లి టీఎస్‌ఎంఎస్‌ విద్యార్థి ఎల్‌.విజయ్‌ రూపొందించిన మల్టీపర్పస్‌ నాగలి, కోరెం జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి పి.రాజ్‌కుమార్‌ రూపొందించిన యాక్సిడెంట్‌ ప్రొటెక్ట్‌ వెయిస్ట్‌ కోట్‌ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి డి.రాధాకిషన్‌, జిల్లా సైన్స్‌ అధికారి ఆంజనేయులు, మండల విద్యాధికారులు విద్యార్థులను అభినందించారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని