logo

బాధ్యతలు చేపట్టిన అదనపు న్యాయమూర్తులు

సర్వోన్నత న్యాయస్థానంలోని కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా ఐదుగురు అదనపు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ వచనాన్ని స్వీకరించారు. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ అనిల్‌ భీమసేన కట్టి, జస్టిస్‌

Published : 17 Aug 2022 02:47 IST

నూతన న్యాయమూర్తులతో గవర్నర్‌ గహ్లోత్‌, ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై,  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధె

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : సర్వోన్నత న్యాయస్థానంలోని కొలీజియం సిఫార్సులకు అనుగుణంగా ఐదుగురు అదనపు న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ వచనాన్ని స్వీకరించారు. రాజ్‌భవన్‌లోని గ్లాస్‌హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్‌ అనిల్‌ భీమసేన కట్టి, జస్టిస్‌ గురుసిద్ధయ్య బసవరాజ, జస్టిస్‌ చంద్రశేఖర్‌ మృత్యుంజయ జోషి, జస్టిస్‌ ఉమేశ్‌ మంజునాథ్‌ భట్ అడిగ, జస్టిస్‌ తలకాడు గిరిగౌడ శివశంకరేగౌడలకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ ప్రమాణ వచానాన్ని బోధించారు. ముఖ్యమంత్రి బవసరాజ బొమ్మై, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ ఆరాధె, బెంగళూరు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, సీనియరు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని