logo

1.5 కి.మీ.. 30 చెరువులు

నంద్యాల మండలం  రాయమాల్పురం క్రాస్‌ రోడ్డు నుంచి మునుగాలకు వెళ్తే దారి అధ్వానంగా మారింది. 1.5 కి.మీ తారురోడ్డుపై 30కి పైగా గుంతలు పడ్డాయి.

Published : 06 Sep 2023 03:49 IST

న్యూస్‌టుడే, నంద్యాల గ్రామీణం: నంద్యాల మండలం  రాయమాల్పురం క్రాస్‌ రోడ్డు నుంచి మునుగాలకు వెళ్తే దారి అధ్వానంగా మారింది. 1.5 కి.మీ తారురోడ్డుపై 30కి పైగా గుంతలు పడ్డాయి. వర్షాలకు వాటిలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. ఈ మార్గంలో పోలూరు, మునుగాల, రాయమాల్పురం గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ద్విచక్ర వాహనాలపై నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రోడ్డుకు 2017లో మరమ్మతులు నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ నిర్వహణ చేపట్టకపోవడంతో దారి దారుణంగా మారింది. వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు.


పట్టణ దారులూ పట్టవు

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని షాదీఖానా రహదారి గోతులమయంగా మారింది. టీఎం మిల్లు నుంచి షాదీఖానా వరకు దారంతా గుంతలే కనిపిస్తున్నాయి. ఇక్కడ రహదారి వేసేందుకు రూ.30 లక్షలతో టెండర్లు పిలిచినా గతంలో కౌన్సిల్‌ తీర్మానం ఆమోదించకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు.  


ఏరులై పారుతున్న ఊరి దారులు!

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలంలో ఏ దారి చూసినా చెరువును తలపిస్తోంది. రహదారులు గుంతలమయంగా మారడం.. గత కొంతకాలంగా తట్టెడు మట్టిపోయకపోవడంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్దఎత్తున నీళ్లు నిలిచి ఏరులై ప్రవహిస్తున్నాయి. ఉరుకుంద - హాల్వి రహదారిపై పదుల సంఖ్యలో చెరువులు దర్శనమిస్తున్నాయి. ఈ రోడ్డు అధ్వానంగా మారడంతో కోసిగి-హాల్వి బస్సు సర్వీసులు రద్దు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని