logo

5 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ

ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది.

Published : 30 Apr 2024 03:48 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవో, ఏపీవో, ఓపీవోలు, అత్యవసర సర్వీసుల్లో విధులు నిర్వహిస్తున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. మే 5 నుంచి 8వ తేదీ వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల ఓటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి డా.సృజన సోమవారం పేర్కొన్నారు. అత్యవసర సర్వీసుల్లో పనిచేసేవారు 5వ తేదీ నుంచి 7వ తేదీలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని