logo

నామినేషన్లకు నేడే ఆఖరి రోజు

మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Updated : 25 Apr 2024 07:30 IST

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు మొత్తం 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరు మొత్తం 53 సెట్ల నామపత్రాలు సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌లో ఏడుగురు అభ్యర్థులు మొత్తం 9 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు. తెలంగాణ జాగీర్‌ పార్టీ నుంచి నరేశ్‌రెడ్డి, సోషల్‌ జస్టిస్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి బి.రవీందర్‌, ధర్మ సమాజ్‌ పార్టీ నుంచి జి.రాకేశ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గోవిందమ్మ, బి.సత్యనారాయణ, వెంకటరమణ, కె.శ్రీనివాసులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి రవినాయక్‌కు సమర్పించారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి ఒగ్గు వినయ్‌, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి అమర్నాథ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గీత, భిక్షపతి నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌కుమార్‌కు సమర్పించారు. నామినేషన్లకు గురువారం చివరి తేదీ. ఇప్పటికే ప్రధాన పార్టీ అభ్యర్థులందరూ నామపత్రాలు దాఖలు చేశారు. చివరి రోజు మరిన్ని నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి.

నేడు గుజరాత్‌ సీఎం రాక

 నాగర్‌కర్నూల్‌ భాజపా అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌ గురువారం మరో సెట్‌ నామినేషన్‌ వేేయనున్నారు. ఈ కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ పాటిల్‌, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. పట్టణంలో ర్యాలీతోపాటు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ భారాస అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి మరో సెట్‌ నామపత్రాన్ని సమర్పించనున్నారు.  మహబూబ్‌నగర్‌లో ఇప్పటి వరకు ప్రధాన పార్టీ అభ్యర్థులైన వంశీచంద్‌రెడ్డి(కాంగ్రెస్‌)- 3 సెట్లు, డీకే అరుణ(భాజపా)- 2 సెట్లు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి (భారాస) -1 సెట్టు, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి(కాంగ్రెస్‌)- 3 సెట్లు, భరత్‌ ప్రసాద్‌(భాజపా) -2 సెట్లు, ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌(భారాస)- 2 సెట్ల నామపత్రాలు దాఖలు చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు