Shah Rukh Khan: అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్‌ ఖాన్‌

మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్‌ చెప్పారు.

Published : 04 May 2024 11:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది మూడు సూపర్‌ హిట్‌ చిత్రాలతో అలరించారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan). తన తర్వాత ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రారంభించకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొంత విశ్రాంతి కోరుకున్నట్లు చెప్పారు.

‘నేను గతేడాది మొత్తం బిజీగా ఉన్నాను. విశ్రాంతి లేకుండా పనిచేశాను. శరీరాన్ని చాలా కష్టపెట్టాను. అందుకే కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరవుతానని వాళ్లకు మాటిచ్చాను. అందుకే నా తర్వాత సినిమా జూన్, ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లేలా ప్లాన్‌ చేశాను. ఆరు నెలల విశ్రాంతి తీసుకుంటూ మ్యాచ్‌లు చూసి ఎంజాయ్‌ చేస్తున్నాను’ అని చెప్పారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో షారుక్‌.. కోహ్లీ గురించి మాట్లాడారు.. ‘అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లీ నాకు చాలా కాలంగా తెలుసు. విరాట్‌ అంటే నాకు చాలా ఇష్టం. నేను అనుష్కతో సినిమాలు చేసే సమయం నుంచి నాకు అతడు తెలుసు. మేము చాలా స్నేహంగా ఉంటాం’ అని చెప్పారు. 

ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?

‘పఠాన్’, ‘జవాన్‌’, ‘డంకీ’లతో విజయాన్ని అందుకున్న షారుక్‌ తర్వాత సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ఓ సందర్భంలో దీని గురించి మాట్లాడుతూ.. కొత్త కథతో రానున్నట్లు తెలిపారు. తన వయసుకు తగిన పాత్ర చేయనున్నట్లు చెప్పారు. అది కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. మరోవైపు స్టార్‌ దర్శకుడు అట్లీ మరోసారి షారుక్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. షారుక్‌ ఖాన్ తర్వాతి ప్రాజెక్ట్‌ ఇదా.. కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన మరికొందరు దక్షిణాది దర్శకుల నుంచి కూడా కథలు వింటున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని