logo

‘సమాచార’ ప్రతుల రుసుం రూ.14800

గ్రామాభివృద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా నిబంధనల ప్రకారం రూ.14800 చెల్లిస్తే ఇస్తామని నంగునూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు.

Published : 10 Aug 2022 01:46 IST

చెల్లించేందుకు బిక్షాటన చేపట్టిన దరఖాస్తుదారు


డబ్బులు ఇస్తున్న యువకులు

నంగునూరు, న్యూస్‌టుడే: గ్రామాభివృద్ధి పనులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధుల వివరాలు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా నిబంధనల ప్రకారం రూ.14800 చెల్లిస్తే ఇస్తామని నంగునూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ఆ సొమ్ము తన వద్ద లేక దరఖాస్తుదారు బిక్షాటన ద్వారా సేకరించేందుకు నిర్ణయించుకున్నారు. నంగునూరు గ్రామానికి చెందిన దండు ఆంజనేయులు జులై 27న అర్జీ పెట్టారు. జిరాక్సులకు అవసరమైన రుసుం మొత్తాన్ని గ్రామపంచాయతీ పేరున డీడీ తీసి నిబంధనల ప్రకారం ఇవ్వాలని కార్యదర్శి చంద్రకళ సూచించారు. 2019 నుంచి ప్రస్తుతం వరకు మొత్తం వివరాలు 7400 పేజీలు ఉందని జిరాక్సు ఖర్చులు ఇవ్వాల్సి ఉంటుందని ఆగస్టు 3న నోటీసు ద్వారా తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆయన బిక్షాటన చేస్తూ వసూలు చేసుకుంటున్నారు. ప్రజలు స్పందిస్తూ కొంత మొత్తాలను ఇస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని