logo

భారాస అక్రమాలు బయటపడుతున్నాయి

బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్‌రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి.

Published : 27 Apr 2024 01:49 IST

మంత్రి కొండా సురేఖ

పార్టీ కార్యాలయంలో అభివాదం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్‌ అభ్యర్థి నీలం మధు, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి హరికృష్ణ, నాయకులు

సిద్దిపేట టౌన్‌, జగదేవపూర్‌, న్యూస్‌టుడే: బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్‌రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. ఆమె మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడటం సరైంది కాదని, 52 శాతం ఉన్న బీసీలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు.  భారాస అధికారంలో ఉన్నప్పటి వాళ్ల దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు బయటపడుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి పంపించే వరకు విశ్రమించనన్నారు. తాము మాటల మనుషులం కాదని, చేతల్లో చూపిస్తామన్నారు. అనంతరం మెదక్‌ పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ మాట్లాడారు. మెదక్‌ జిల్లాలో భారాసకు నాయకులే కరవయ్యారని స్థానికేతరుడైన వెంకట్రామిరెడ్డికి టిక్కెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భారాస ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వలేదని వాపోయారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు గంప మహేందర్‌రావు, అత్తూఇమామ్‌, తాడూరి శ్రీనివాస్‌, గూడూరి శ్రీనివాస్‌, బొమ్మల యాదగిరి, కలీమొద్దీన్‌, చెరకు శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్లు రియాజుద్దీన్‌, సాకి బాల్‌లక్ష్మి, ముత్యాల శ్రీదేవి, చిట్టి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

రాముడి పేరుతో రాజకీయాలు

గుడిలో, భక్తుల హృదయాల్లో ఉండే శ్రీరామచంద్రుడి పేరుతో భాజపా రాజకీయాలు చేస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జగదేవపూర్‌ మండలం దౌలాపూర్‌లో మాట్లాడుతూ అన్నారు. ఆమె ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ బాలేశంగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని