logo

రావణ దహనానికి రంగం సిద్ధం

విజయ దశమి వేడుకలకు సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ మైదానం ముస్తాబైంది. బుధవారం జరిగే వేడుకలకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 05 Oct 2022 00:59 IST


జిల్లాకేంద్రంలో..

సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే:  విజయ దశమి వేడుకలకు సంగారెడ్డిలోని అంబేడ్కర్‌ మైదానం ముస్తాబైంది. బుధవారం జరిగే వేడుకలకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో అతిథులు కూర్చునేందుకు స్టేజి, వెయ్యికిపైగా కుర్చీలతో పాటు ప్రజలు కార్యక్రమం వీక్షించేందుకు బారికేడ్లు, ఫ్లడ్‌ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్టేజికి పక్కనే పెద్ద రావణాసుర విగ్రహాన్ని దహనానికి సిద్ధం చేశారు. శ్రీరామ మందిరం నుంచి సీతారామ లక్ష్మణ విగ్రహాలు వచ్చిన వెంటనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రజలు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.


సిద్దిపేట టౌన్‌: విజయదశమి సంర్భంగా సిద్దిపేటలో బాణసంచా మోత, నృత్యాలతో అంబరాన్నంటే సంబరాలకు సిద్ధం చేస్తున్నారు. రంగధాంపల్లిలో హనుమాన్‌ ఆలయం వద్ద రావణుని భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద దాసాంజనేయ స్వామి ఆలయ కమిటీ రావణ దహనం నిర్వహిస్తోంది. పురపాలిక, పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. పట్టణంలో జరిగే దసరా ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ రాజనర్సు, ఏసీపీ దేవారెడ్డి, కౌన్సిలర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని