logo

హుస్నాబాద్‌లో సబ్‌కోర్టు అత్యవసరం

హుస్నాబాద్‌లో సబ్‌కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

Published : 02 Dec 2022 02:02 IST

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

ఎమ్మెల్యే రాజేందర్‌కు వినతిపత్రం ఇస్తున్న న్యాయవాదులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: హుస్నాబాద్‌లో సబ్‌కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. హుస్నాబాద్‌లో సబ్‌కోర్టు ఏర్పాటుకు న్యాయవాదులు చేపట్టిన దీక్ష గురువారం కొనసాగింది. శిబిరాన్ని ఈటల సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 రోజులుగా ఇక్కడ న్యాయవాదులు దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కేసులు తక్కువగా నమోదయ్యే గజ్వేల్‌, వేములవాడలలో సబ్‌కోర్టు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, కేసుల సంఖ్య ఎక్కువగా ఉండే హుస్నాబాద్‌ను విస్మరించడం తగదన్నారు. ఇక్కడి వారికి సంగారెడ్డికి వెళ్లి రావడం ఇబ్బందిగా ఉందన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశం, న్యాయవాదులు రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. హౌస్‌ఫెడ్‌ మాజీ ఛైర్మన్‌ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, భాజపా నాయకుడు జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, సెన్సార్‌బోర్డు సభ్యురాలు తిరుమల, శ్రీనివాస్‌, శంకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని