logo

లెక్కకు మించితే వేటే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది.

Updated : 28 Apr 2024 06:40 IST

లోక్‌సభ అభ్యర్థుల ఖర్చుపై ఈసీ నిఘా

భానుపురి, హాలియా, మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది. అభ్యర్థులు ప్రచారంలో భాగంగా సభలు, ర్యాలీల నిర్వహణ, భోజనాలు, వాహనాలు, తదితర ఖర్చులు ఉంటాయి. అభ్యర్థులు హద్దులు దాటకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక తనిఖీ బృందాలు ఆ ఖర్చులను లెక్కకడుతున్నాయి.

వ్యయ పరిమితి రూ.95 లక్షలు

లోక్‌సభ అభ్యర్థి ఎన్నికల ప్రచార నిమిత్తం ఈసీ వ్యయ పరిమితిని రూ.95 లక్షల వరకు నిర్ణయించింది. ఆ పరిమితి దాటి ఖర్చు చేయొద్దు. నామినేషన్‌ దాఖలు చేసిన నాటి నుంచి ఎన్నికల ఖర్చులు లెక్కిస్తారు. అభ్యర్థి ఏదైనా జాతీయ బ్యాంకులో నూతన ఖాతా తెరిచి దాని ద్వారా లావాదేవీలు నిర్వహించాలి. ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు అభ్యర్థులు తమ పూర్తి ఖర్చు వివరాలను బిల్లులతో సహా అధికారులకు అప్పగించాలి. పరిమితికి మించి ఖర్చు చేసినా,  లెక్కలు చూపకున్నా సంబంధిత అభ్యర్థిపై వేటు పడటంతోపాటు తర్వాత ఎన్నికల్లో పోటీచేసే హక్కును కోల్పోతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని