icon icon icon
icon icon icon

Chandrababu: తిరుగుబాటు మొదలైంది.. ఒక్క ఉద్యోగి కూడా జగన్‌కు ఓటు వేయలేదు: చంద్రబాబు

అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

Published : 10 May 2024 21:40 IST

ఒంగోలు: అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ ఒక విధ్వంసకారి.. సైకో అని ధ్వజమెత్తారు. జగన్‌ ఏనాడైనా ఒక్క మంచిపని చేశారా? అని ప్రశ్నించారు. మద్యం దుకాణాల్లో అన్‌లైన్‌ చెల్లింపులకు అవకాశం లేదని, మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో సగం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తోందన్నారు. మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్‌ హామీ నెరవేరిందా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 

‘‘ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పెట్టారు. జగన్‌ను కుటుంబ సభ్యులే విమర్శిస్తున్నారు. ఒక్క ఉద్యోగి కూడా జగన్‌కు ఓటు వేయలేదు. రాష్ట్రంలో తిరుగుబాటు ప్రారంభమైంది. వైకాపా పాలన వల్ల ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది. విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? సంక్షేమ పాలన కావాలా.. సంక్షోభ పాలన కావాలా? మీ పిల్లలకు ఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా? మే 13న పోలింగ్‌.. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీ భూములు మీ కష్టార్జితం.. వాటిపై జగన్‌ ఫొటో ఎందుకు? పట్టాదారు పాస్‌బుక్‌ అంటే ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ. జగన్‌కు మీ ఆస్తిపై కన్ను పడింది. మీ భూములు అమ్మాలంటే ఆయన అనుమతి కావాలంట. వైకాపా తెచ్చింది ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదు. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌. మేం వచ్చాక  ఆ చట్టాన్ని రద్దు చేస్తాం. ప్రభుత్వ ముద్ర ఉన్న పాస్‌బుక్‌ ఇస్తాం. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నారా.. ఎవ్వరూ కాపాడలేరు’’ అని చంద్రబాబు అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img