logo

ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి

అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ రాబర్ట్‌సింగ్‌ క్షేత్రమయుమ్‌,

Updated : 30 Apr 2024 06:26 IST

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే, చిత్రంలో జనరల్‌ అబ్జర్వర్‌ రాబర్ట్‌సింగ్‌ క్షేత్రమయుమ్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేశ్‌ రంజన్‌, సాయన్‌ దేబర్మ

భువనగిరి, న్యూస్‌టుడే: అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హన్మంత్‌ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ రాబర్ట్‌సింగ్‌ క్షేత్రమయుమ్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేశ్‌ రంజన్‌, సాయన్‌ దేబర్మ సమక్షంలో ఎన్నికల బరిలో నిలిచిన 39 మంది అభ్యర్థులు, వారి ప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ ఎన్నికల వ్యయంపైన వివరించారు. భువనగిరి పార్లమెంట్‌లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల్లో రేట్‌ కార్డు ప్రకారం అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చును తప్పనిసరిగా మూడు రిజిస్టర్లలో ప్రతి రోజూ వ్యయ ఖర్చులు, క్యాష్‌ వివరాలు, బ్యాంక్‌ లావాదేవీలు నమోదు చేయాలని తెలిపారు. ప్రతి అభ్యర్థి రూ.95 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని, ఎన్నికలు అయిన తర్వాత రిటర్నింగ్‌ అధికారి వద్ద ఎన్నికల ఖర్చు ఫైనల్‌ రీకన్సిలేషన్‌ చేసుకోవాలని తెలిపారు. సువిధ ద్వారా ర్యాలీలు, సమావేశాలు, సభలకు సంబంధిత అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి నుంచి అనుమతులు పొందవచ్చని సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గంగాధర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని