logo

AP News: తండ్రికి కూతురు కాలేయ దానం

కన్న తండ్రికి కూతురు కాలేయ దానం చేశారు. వివరాల్లోకి వెళితే నార్తుమోపూరుకు చెందిన ఎ.వెంకట రమణయ్యకు లివర్‌ దెబ్బతినడంతో కుమార్తె ధనమ్మ సగం లివర్‌ను దానం చేసింది. చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సను నిర్వహించి కూతురు

Updated : 17 Dec 2021 11:00 IST

వివరాలు వెల్లడిస్తున్న డాక్టర్‌ రజనీకాంత్‌

నెల్లూరు (వైద్యం) : కన్న తండ్రికి కూతురు కాలేయ దానం చేశారు. వివరాల్లోకి వెళితే నార్తుమోపూరుకు చెందిన ఎ.వెంకట రమణయ్యకు లివర్‌ దెబ్బతినడంతో కుమార్తె ధనమ్మ సగం లివర్‌ను దానం చేసింది. చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సను నిర్వహించి కూతురు నుంచి తండ్రికి లివర్‌ను విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం మెరుగుపడటంతో నగరంలోని గ్లోబల్‌ ఆసుపత్రి సెంటర్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ధనమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం తమ ఆరోగ్యం బాగుందని తెలిపారు. శస్త్ర చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల సాయం అందిందన్నారు. డాక్టర్‌ రజనీకాంత్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు 100 లివర్‌ మార్పిడిలు విజయవంతంగా నిర్వహించామన్నారు. సమావేశంలో ఆ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని