logo

ముగిసిన నామినేషన్ల పరిశీలన

జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Updated : 27 Apr 2024 04:49 IST

పార్లమెంటుకు 15, అసెంబ్లీకి 130 ఆమోదం

నామినేషన్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరినారాయణన్‌

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు పార్లమెంటుకు మొత్తం 21 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా.. ఆరుగురివి తిరస్కరించారు. 15 మందివి ఆమోదించారు. ఎనిమిది నియోజకవర్గాల్లో 31 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించగా.. 130 మందివి ఆమోదం పొందాయి. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి 25 మంది అభ్యర్థులు దాఖలు చేయగా ఒకరిది తిరస్కరించారు. కావలిలో 25 మంది దాఖలు చేయగా.. 15 మందివి ఆమోదం పొందాయి. ఆత్మకూరులో 15 మందికి ఇద్దరివి తిరస్కరించారు. కోవూరులో 28కి 9, నెల్లూరునగర నియోజకవర్గంలో 26కు 18 మందివి ఆమోదం పొందాయి. 8 మందివి తిరస్కరించారు. నెల్లూరురూరల్‌లో 13 మంది దాఖలు చేయగా.. ఒకటి, సర్వేపల్లిలో 17 మందికి నలుగురివి, ఉదయగిరిలో 22 మందికి ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని