logo

సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం

సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్‌ దాఖలు అనంతరం మాట్లాడారు.

Published : 25 Apr 2024 02:53 IST

ఆర్వోకు నామపత్రాలు అందజేస్తున్న సోమిరెడ్డి  చంద్రమోహన్‌ రెడ్డి

వెంకటాచలం, న్యూస్‌టుడే: సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్‌ దాఖలు అనంతరం మాట్లాడారు. బూటకపు హామీలిచ్చే సీఎం జగన్‌ను, వైకాపాను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.  ఎన్డీఏ ఎంపీˆ అభ్యర్థి వర ప్రసాద్‌ మాట్లాడారు. సర్వేపల్లి తెదేపా అభ్యర్థిగా సోమిరెడ్డి  అట్టహాసంగా నామినేషన్‌ వేశారు.కుటుంబ సభ్యులు, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌తో కలిసి  ఉదయం 11:18 గంటలకు తన నామపత్రాలను ఆర్వో చినఓబులేశుకు అందజేశారు.  

సోమిరెడ్డి కుటుంబ ఆస్తులు రూ. 11.03 కోట్లు

ఈనాడు, నెల్లూరు: మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 11.03 కోట్లుగా  అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో సోమిరెడ్డి పేరున రూ. 62 లక్షల చర, రూ. 9.18 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య జ్యోతి పేరున రూ. 1.22 కోట్ల చరాస్తులున్నాయి.  సోమిరెడ్డిపై మొత్తం 17కేసులు ఉండగా.. వాటిలో 12 వైకాపా ప్రభుత్వంలోకి వచ్చిన అయిదేళ్లలో నమోదు చేసినవే.


కురుగొండ్ల నామినేషన్‌..

నామపత్రాలు అందజేస్తున్న కురుగొండ్ల రామకృష్ణ

వెంకటగిరి గ్రామీణం : వెంకటగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ నామినేషన్‌ వేశారు.  తన నివాసం నుంచి కాశీపేట, పోలేరమ్మ గుడి నుంచి పాత బస్టాండ్‌ మీదుగా భారీ ర్యాలీగా సాగారు. నల్లబోతుల మురళీతో ద్విచక్ర వాహనం వెనుక కూర్చొని నామినేషన్‌ కేంద్రానికి వెళ్లారు. భార్య సింధూతో కలిసి ఆర్వోకి నామపత్రాలు సమర్పించారు. రామకృష్ణపై 11 కేసులున్నాయి. 8 వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టినవే  కురుగొండ్ల ఆస్తుల విలువ రూ.91.73 కోట్లు, భార్య పేరిట రూ.16.58 కోట్లు, అప్పులు రూ.14.50 కోట్లు అఫిడవిట్‌లో చూపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు